హంద్రీనీవా కాలువను పరిశీలించిన మాజీ మంత్రి
హంద్రీనీవాను అర్ధాంతరంగా వదిలేసి రైతాంగాన్ని ముంచారు- టీడీపీ;
అనంతపురం జిల్లా కసాపురం వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించారు టీడీపీ నేతలు. హంద్రీనీవాను అర్ధాంతరంగా వదిలేసి రైతాంగాన్ని సీఎం జగన్ నట్టేట ముంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ సామర్ధ్యాన్ని 6వేల క్యూసెక్కులకు పెంచుతానని చెప్పి మోసం చేశారంటూ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఆర్.జితేంద్ర గౌడ్ విమర్శించారు. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్.. ఏ మొహం పెట్టుకుని జిల్లాకు వస్తున్నాడంటూ ప్రశ్నిస్తున్నారు.