శింగనమల నియోజక వర్గ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. దళితులను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త దళితులను ఎదగనీయడం లేదని ఆరోపించారు ఎస్సీ నేత. తమను అణిచివేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్. రాజకీయంగా తమను ముందుకు వెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఎమ్మెల్యే భర్తకు దళితులంటే గిట్టదని అందుకే తమను ముందుకెళ్లనివ్వడం లేదని విమర్శించారు.