ఏపీలో నరసరావుపేట కేంద్రంగా మాదక ద్రవ్యాల వ్యాపారం ఖండాంతరాలకు పాకింది.. సూడాన్ ఉగ్రవాదులకు సరఫరా అవుతున్న డ్రగ్స్ తయారీకి నరసరావుపేట పట్టణం అడ్డాగా మారింది. సేఫ్ ఫార్మాకు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్లుగా ముంబై కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది.. డైరెక్టర్ శనగల శ్రీధర్‌రెడ్డిని ముంబై కస్టమ్స్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.. సూడాన్‌కు తరలిస్తున్న 10 లక్షల ట్రామడాల్ ట్యాబ్లెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.