మోత్కూరు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో బయటపడ్డ అవకతవకలు

సెలవుపై వెళ్లిన సబ్ రిజిస్ట్రార్; ఏకంగా 66 ప్లాట్ల డాక్యుమెంట్లను తారుమారు చేసిన సబార్డినేట్;

Update: 2023-04-28 10:08 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఇన్‌ఛార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ చెలరేగిపోయాడు. ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ సెలవుపై వెళ్తూ.. సబార్డినేట్‌కు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగిoచాడు. సీన్ కట్ చేస్తే.. గంటల వ్యవధిలో ఊహించని రీతిలో అక్రమాలకు తెరలేపారు. ఏకంగా.. అక్రమ లే అవుట్ లకు సంబంధించిన 66 ప్లాట్ల డాక్యుమెంట్లను... నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశాడు. సెలవుపై వెళ్ళిన రిజిస్ట్రార్ తిరిగి విధుల్లోకి వచ్చి చూడగా బండారం బట్టబయలైంది. ఉన్నతధికారుల ఆదేశాలతో.. ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ తనిఖీ చేయడంతో అక్రమాల బాగోతం బయటపడింది.

Tags:    

Similar News