కారులో చిక్కుకుని, ఊపిరాడక చిన్నారి మృతి
కాకినాడలోని కోలంకలో చోటుచేసుకున్న ఘటన;
కాకినాడ జిల్లాలోని కోలంకలో కారులో ఇరుక్కుపోయిన ఎనిమిదేళ్ల చిన్నారి అఖిలాండేశ్వరి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన బాలిక.. పక్కింటివారు రోడ్డుపై నిలిపిన కారులోకి వెళ్లి కూర్చుంది. కారు డోర్ లాక్ కావడంతో ఆ పాప బయటి రాలేకపోయింది. ఊపిరి ఆడక మృతి చెందింది. బాలిక కన్పించకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. చివరికి ఇంటి పక్కనున్న కారులో విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు.