సిద్ధిపేటలో వృద్ధుడి ఆత్మహత్య కలకలం
తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన వెంకటయ్య
సిద్దిపేట జిల్లా పొట్లపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. జీవితం భారమై ఓ వృద్ధుడు తన చితిని తానే పేర్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడబోయిన వెంకటయ్య కు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. గత కొంత కాలం క్రితం భార్య చనిపోవడంతో తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమారులకు పంచి ఇచ్చేశాడు. ఈ క్రమంలో వెంకటయ్యను చూసుకునేందుకు కొడుకులు వంతులు వేసుకోవడంతో అతడి మనసు ముక్కలైంది. తాను ఎవరికీ భారం కాకూడదని, సొంత ఊరుని విడిచి వెళ్లేందుకు ఇష్టపడని వెంకటయ్య ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. వెంకటయ్య మరణంలో పొట్లపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.