పొంగులేటి రైతు భరోసా యాత్ర
క్యాంప్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ;
ఖమ్మంలో రైతు భరోసా ర్యాలీ చేపట్టారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని.. తడిసిన ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొంగులేటి క్యాంప్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగగా.. ధాన్యం తడిసి ముద్దయితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుగు పేరుతో మిల్లర్లు రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.