రైస్ మిల్లర్లపై గంప గోవర్థన్ దాడి

ధాన్యం కొనుగోలుపై సిబ్బందిని ప్రశ్నించిన గంప గోవర్ధన్; నిర్లక్ష్యపు సమాధానంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే

Update: 2023-05-06 10:30 GMT

రైస్‌మిల్‌ సిబ్బందిపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ రెడ్డి చేయి చేసుకున్నాడు. కామా రెడ్డి జిల్లా భిక్నూర్‌ మండలం పెద్దమల్లారెడ్డిలో ఘటన వెలుగుచూసింది. రైస్‌మిలర్లు తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో నేరుగా రైస్‌మిల్‌కు వెళ్లి ధాన్యం కొనుగోలుపై సిబ్బందిని ప్రశ్నించారు. అయితే సిబ్బంది నిర్లక్షపు సమాధానంపై కోపం తెచ్చుకున్న గంప గోవర్ధన్.. సిబ్బందిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అవ్వగా అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News