రైతులు ఏడుస్తుంటే జగన్ సంబరాలు చేసుకుంటున్నాడు
ముఖ్యమంత్రే తమకు పట్టిన దరిద్రమని మండిపడ్డ తేదేపా సీనియర్ నేత;
రైతులను జగన్ సర్కార్ తీవ్రంగా అవమానిస్తుందన్నారు టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర. జగనన్నే మా దరిద్రమని రైతులంతా గొంతెత్తి చెపుతున్నారని,రైతు కన్నీరు పెడుతుంటే అభినవ నీరో చక్రవర్తి తాడేపల్లి ప్యాలెస్‌లో సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులను జగన్ సర్కార్ తీవ్రంగా అవమానిస్తుందని విమర్శించారు. చంద్రబాబుని, టీడీపీని నిందించడం తప్ప వ్యవసాయ మంత్రికి వేరే పని లేదన్నారు.