జనగామ ఎమ్మెల్యేపై కుమార్తె పోలీస్ ఫిర్యాదు
తండ్రి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపిస్తోన్న తుల్జా భవానీ రెడ్డి
జనగామ ఎమ్మెల్యేముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై స్వయంగా ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి పోలీసు కేసు నమోదు చేశారు. తండ్రి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేర్యాల చౌరస్తాలో చేరువుని ఆనుకుని తనకు ఉన్న 1 ఎకరం 20 గుంటల భూమిని కాజేసేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సెక్షన్ 406,420,463,464,468,471 కింద కేసు నమోదు చేశారు. గతంలో ఇదే భూమి కబ్జా విషయంలో యాదగిరి రెడ్డిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.