పాక్ మాజీ ప్రధాని అరెస్ట్
ఇస్లామాబాద్ కోర్టు వద్ద అదుపులోకి తీసుకున్న రేంజర్లు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు దగ్గర ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్ సమయంలో ఇమ్రాన్ లాయర్లు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. దాదాపు వంద కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ ను కొన్ని రోజులగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అరెస్ట్‌పై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను అంతం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.