జగనన్న విదేశీ విద్య పథకానికి కత్తెర

సబ్జెక్టులవారీగా టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న వారికే సాయం; గోప్యంగా ఉంచిన తాజా సవరణ

Update: 2023-05-10 09:05 GMT

జగనన్న విదేశీ విద్య పథకానికి వైసీపీ ప్రభుత్వం కత్తెరేసింది. ఇప్పటికే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఈ పథకానికి దూరమయ్యారు. ఇప్పుడు వీరి సంఖ్య మరింత తగ్గిపోయేలా మార్గదర్శకాల్లో సవరణలు చేశారు. పథకం ఇస్తున్నట్లు చూపిస్తూనే.. పేదలకు పూర్తి స్థాయిలో అందకుండా నిబంధనల్లో మార్పులు తెచ్చింది. గతేడాది క్యూఎస్‌ ర్యాకింగ్‌లో టాప్‌ 200లో ఉన్న యూనివర్శిటిల్లో సీట్లు పొందిన వారికి సాయాన్ని అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు సబ్జెక్టులవారీగా టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న వాటికే సాయం ఇస్తామంటూ సవరణ చేసింది.ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వాటిని గోప్యంగా ఉంచింది. 

Tags:    

Similar News