హనుమాన్ జయంతిని పురస్కరించుకుని, వేలాది సంఖ్యలో హనుమాన్ భక్తులు, భద్రాచలం రామన్న సన్నిధికి చేరుకున్నారు. వేలాది భక్తులు రావడంతో ఆలయ ప్రాగణం రామనామస్మరణలతో మారుమ్రోగిపోయింది. తెల్లవారుజామునే భక్తులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి గంగానదికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలోని, మూల విరాట్‌ను దర్శించుకున్నారు.