వాంఖడేకు బిగుస్తోన్న సీబీఐ ఉచ్చు
మరో నలుగురిపైనా కేసు నమోదు చేసిన సీబీఐ;
నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. వాంఖడేతోపాటు మరో నలుగురిపైనా సీబీఐ కేసు నమోదు చేయగా కేసు ఎఫ్ఐఆర్ బయటికి వచ్చింది. వాంఖడే విదేశీ పర్యటనలు, విలువైన చేతి గడియారాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. పర్యటనలకు సంబంధించిన వివరాలను చెప్పలేదని ఎఫ్ఐఆర్‌లో తెలిపింది. డిపార్ట్‌మెంట్‌కు చెప్పకుండా చేతిగడియారాలు కొనుగోలు, అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు. ఆ ఖర్చుల వివరాలకు.. వాంఖడే చెప్పిన వివరాలకు పొంతన లేకుండా ఉందని సీబీఐ తెలిపింది.