టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో నలుగురు అరెస్ట్

35కు చేరిన అరెస్ట్ ల సంఖ్య;

Update: 2023-05-18 07:33 GMT

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో నలుగురు నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు 35 మంది అరెస్ట్ అయ్యారు. డీఏవో పరీక్షల్లో ర్యాంకులు.. అత్యధిక మార్కులు సాధించిన వారిపై దృష్టి పెట్టిన అధికారులు, రాష్ట్రస్థాయిలో తొలి మూడు ర్యాంకులు సాధించిన నిందితులను అరెస్ట్ చేశారు. కీలక నిందితుడిగా ఉన్న రాజేశ్వర్‌కు మొదటి ర్యాంకు రాగా అతని భార్య శాంతికి రెండో ర్యాంకు వచ్చింది. నిందితురాలు రేణుక స్నేహితుడు రాహుల్ కుమార్‌కు మూడో ర్యాంకు వచ్చింది.


Tags:    

Similar News