పెద్దిరెడ్డి సోదరుల రౌడీయిజం
పుంగనూరు, తంబళ్లపల్లెలో రిజర్వాయిల పనుల్లో భారీ అక్రమాలు;
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు, అరాచకాలకు అడ్డేలేకుండా పోతోంది. పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి దోపిడీకి, దాష్టీకం హెచ్చుమీరుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్నదమ్ములిద్దరూ ఇటు పుంగనూరు.. అటు తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఏకంగా నియంత పాలన సాగిస్తున్నారు. ముదివేడుల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన కళ్లకు కడుతోంది. ప్రాజెక్టుల నిర్మాణంతో సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే నిర్మాణాలు ప్రారంభించడం పెద్దిరెడ్డి దాష్టీకానికి అద్దంపడుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి.