నల్గొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
రసాభాసగా మారిన ఐటీయూ చేపట్టిన నిరసన కార్యక్రమం;
నల్గొండ జిల్లా కలేక్టరేట్ ముందు ఉద్రిక్తత నెలకొంది. IKP-VOAలకు మద్దతుగా సీఐటీయూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఉద్యోగులను నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో సీఐటీయూ కార్యకర్తలు పోలీసు వాహనాలకు అడ్డుగా నిలవడంతో మహిళా వీఏఓలను స్టేషన్‌కు తరలించడం కష్టంగా మారింది.