బీఆర్ఎస్ విజయం తథ్యం
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదిరి కిశోర్ ప్రశంసల వెల్లువ;
తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్. కర్నాటకలోని రాయచూర్ ఎమ్మెల్యే.. తమను తెలంగాణలో కలపమని అడగటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కర్నాటకలో బీజేపీ పాలనపై ప్రజలు విసిగి వేసారడంతో.. ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ గెలుపునకు దోహదపడిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలవడమే కాకుండా.. మూడోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమంటున్న గాదరి కిశోర్.