కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై వివాదం కొనసాగుతోంది. లాలూ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చింది. కొత్త పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చడంపై ఆర్‌జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ స్పందిస్తూ, “మా ట్వీట్‌లోని శవపేటిక ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడాన్ని సూచిస్తుంది. దీన్ని దేశం అంగీకరించదు. పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం మరియు చర్చలు జరపడానికి ఇది వేదిక అని అన్నారు.