రాజస్థాన్ లో ప్రధాని మోదీ పర్యటన
శ్రీనాథ్‌జీ మందిరాన్ని సందర్శించిన మోదీ;
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. రాజసమంద్ జిల్లా నాథ్‌ద్వారాలో 5 వేల 5 వందల కోట్ల మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉదయ్‌పూర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు శిలాఫలకం వేశారు. రాజస్థాన్-ఉదయ్‌పూర్ రెండు లేన్ల రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రధాని మోదీశ్రీనాథ్‌జీ మందిరానికి వచ్చారు. దేవుడి దర్శనం చేసుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరంలో పూజారులతో కలిసి కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు చర్చించారు. శ్రీనాథ్ జీ మందిరానికి వచ్చే సమయంలో మోదీ వాహనంపై ప్రజలు పూలవర్షం కురిపించారు. భారీగా తరలివచ్చిన ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు.