ఇటలీలో భారీ పేలుడు జరిగింది. మిలన్ సిటీ మధ్యలో రహదారిపై పేలుడు సంభవించింది. ఆగి ఉన్న వ్యాన్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. అనేక కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఘటనాస్థలిలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. పార్క్ చేసిన వాహనంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.