ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శేషాచల కొండపై, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. అట్లూరు, ఎల్వీపి ట్రావెల్స్‌కు చెందిన బస్సు క్లీనర్లు మద్యం మత్తులో బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు. అడ్డుకున్న దేవస్థానం సిబ్బందిపైనా దాడి చేసారు. క్లీనర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బస్సులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.