ఎమ్మెల్యే స్వామి భక్తి...
ప్రభుత్వ ఆసుపత్రికి వైసీపీ నేతల పెయింటింగ్...;
నాయుడు పేట మున్సిపాలిటిలో ప్రభుత్వ ఆసుపత్రి తలుపుల పై జగన్ బొమ్మ వేయించి స్వామి భక్తిని చాటుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే సంజీవయ్య. మళ్లీ వైసీపీదే అధికారం అంటూ స్టిక్కర్ల స్థానంలో పర్మినెంట్ పెయింటింగ్ లు వేయించారు. స్థానిక అగ్రహారంలో 85 లక్షలతో నిర్మిస్తున్న ఆరోగ్యకేంద్రానికి సీఎం జగన్, ఎమ్మెల్యే సంజీవయ్య ఫోటోలను పెయింట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పెయింటింగ్‌లు ఏంటని జనం మండిపడుతున్నారు.