IAF: వాయుసేన చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్
ప్రస్తుతం వాయుసేనకు ఉప అధిపతి;
వాయుసేనలో అపార అనుభవం, వ్యూహకర్తగా గుర్తింపు అందుకున్న ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్‌సింగ్ భారత్ వాయుసేన తదుపరి చీఫ్‌గా నియమితులయ్యారు. వాయుసేన ప్రస్తుత అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఈ నెల 30న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ మేరకు శనివారం రక్షణశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అమర్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్’ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా ఉన్నారు. 1964 అక్టోబర్ 27న జన్మించిన ఆయన భారత వాయుసేనలో యుద్ధ విమానాల పైలట్‌గా 1984లో కెరీర్ ఆరంభించారు. గత 40ఏండ్లుగా వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.