CONGRESS: ఎన్నికల బరిలో బండ్ల గణేష్!
కూకట్‌పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి... ఇప్పటికే పూర్తయిన సంప్రదింపులు;
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మళ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారా.. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా... కాంగ్రెస్ అధిష్టానం కూడా దానిపై సమాలోచనలు చేస్తుందా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. బండ్ల గణేష్ కూకట్‌పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన పేరును కూకట్‌పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. గత ఎన్నికల్లో బండ్ల గణేష్ కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం బండ్ల గణేష్ ఈ విషయమై మాట్లాడినట్టు తెలుస్తోంది.