హైదరాబాద్‌లో బెగ్గింగ్ మాఫియా బరితెగించింది. సిటీలో చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో భిక్షాటన చేయిస్తున్నారు. ఇలా బెగ్గింగ్ చేస్తున్న కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన అనిల్ పవార్.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనిల్ పవార్‌ను అరెస్ట్ చేశారు. ప్రతి రోజూ ఒక్కొక్కరి నుంచి.. 5 వేల నుంచి 6 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. భిక్షాటన చేస్తున్న 23మందిని అదుపులోకి తీసుకొని విచారించి ఎన్జీవో హోమ్‌కు తరలించారు.