హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి మిస్సింగ్ కలకలం రేపింది. నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి శరణ్ చౌదరి బయటకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారులో ఎక్కినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శరణ్ చౌదరి ఫోన్ స్వీచ్ఛాఫ్ అయింది. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. ఆందోళ చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా శరణ్ చౌదరి కూకట్ పల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.