రాష్ట్రంలో BJP రథయాత్రలు

Update: 2023-08-14 05:22 GMT

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, హామీల అమలు కోసం ఒత్తిడి పెంచేందుకు పోరాటాలు ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో మూడు కేంద్రాల నుంచి రథయాత్రలు చేపట్టనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి యాత్రలు ప్రారంభించే అవకాశం ఉంది. ఒక్కో కేంద్రం నుంచి ప్రారంభమయ్యే రథ యాత్ర ప్రతీ రోజు కనీసం 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కొనసాగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Tags:    

Similar News