ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బెదిరింపు కాల్
హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది;
హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. డయల్ 100కి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. ఆదాయపన్ను కార్యాలయంలో బాంబు ఉన్నట్లు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. చివరికి బాంబు లేదని గుర్తించిన పోలీసులు.. అది ఫేక్ కాల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఫోన్‌కాల్ ఎక్కడ్నుంచి వచ్చిందో కనుక్కునే పనిలో పడ్డారు.