నాలుగు రోజుల నుంచి నాన్‌స్టాప్‌గా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో హిమాయత్‌సాగర్ జలాశయం 6 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదలు చేస్తున్నారు. రోడ్లపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్‌ను మూసివేశారు. రాజేంద్రనగర్ నుండి కాళిమందిర్, గండిపేట వెళ్లే సర్వీస్ రోడ్ నుంచి ప్రజలు, వాహనదారులెవరూ రావొద్దని అధికారులు హెచ్చరించారు.