Snow fall : కశ్మీర్‌ లోయలో పరుచుకున్న మంచు దుప్పటి..

సోనామార్గ్‌లో దూదిలా పరచుకున్న మంచు

Update: 2025-12-31 07:00 GMT

జమ్ముకశ్మీర్‌ లోని కశ్మీర్‌ లోయ   లో మంచు దుప్పటి  పరుచుకుంది. కశ్మీర్‌ వ్యాలీలోని ప్రసిద్ధ టూరిస్ట్‌ స్పాట్‌ అయిన సోనామార్గ్‌లో తెల్లటి దూది వెదజల్లినట్టుగా మంచు పరుచుకున్నది. దాంతో కశ్మీర్‌ వ్యాలీ పరిసరాలన్నీ అందంగా, ఆహ్లాదకరంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి.

ఆ సుందర దృశ్యాలను టూరిస్టులకు కనువిందు చేస్తున్నాయి. కశ్మీర్‌ వ్యాలీలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గత కొన్ని రోజుల నుంచి మంచు విపరీతంగా కురుస్తున్నది. సన్నని దూది పింజాల్లా రాలుతున్న మంచును యాత్రికులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. కశ్మీర్‌ వ్యాలీ పరిసరాలన్నీ తెల్లని మంచు పరుచుకోవడంతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కింది వీడియోలో ఆ మంచు దృశ్యాలను మీరు కూడా ఒకసారి చూడండి.

Tags:    

Similar News