నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. వరికుంటపాడు మండలం గణేశ్వరపురం గడపగడపకు కార్యక్రమంలో.. వైసీపీ నేతలు బహాబాహీకి దిగారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. కారు దిగిన మేకపాటి రెండు వర్గాల నాయకులను తీవ్రస్థాయిలో మందలించారు. ఇలా కొనసాగితే మీ మండలానికో దండం..ఇక మీ మండల కార్యక్రమాలకు రానంటూ రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.