రెండో విడత వారాహి విజయ యాత్ర షెడ్యూల్ ను విడుదల చేసింది జనసేన పార్టీ. రేపు సాయంత్రం ఏలూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఇక ఈ నెల10న ఏలూరులో మద్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో పవన్‌కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇక 11న దెందులూరు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు,వీర మహిళలతో పవన్‌కళ్యాణ్ సమావేశం కానున్నారు. మరోవైపు ఈనెల 12న తాడేపల్లిగూడెంలో బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.