జమ్మలమడుగు వైసీపీలో వర్గపోరు ముదురుతోంది. నిన్న కిడ్నాపైన వైసీపీ నేత శ్రీనివాసులురెడ్డి మీడియా ముందుకొచ్చారు. తనను కిడ్నాప్ చేయించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వైసీపీ నేత శ్రీనివాసులు రెడ్డి. నీ పాపం పండింది, పైన దేవుడు ఉన్నాడు అని కామెంట్ చేశారు. తాను పెట్టిన పోస్ట్‌లో ఎలాంటి తప్పు లేదని.. ఎమ్మెల్యేను విభేధించి బయటికి వచ్చినందుకు తమపై కక్ష పెంచుకున్నాడని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.