మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని 9వ వార్డులో రూ.2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న దోబీ ఘాట్ పనుల శంకుస్థాపనకు వచ్చారు. అక్కడి సీన్ చూసి ఒక్కసారిగా ఖంగు తిన్నారు. శిలాఫలకం నిర్మించకపోవడంతో మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం లేకుండా శంకుస్ధాపన ఏంటి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.