Gujarat : చోరీ జరగకున్నా కారుకు కట్టేసి తిప్పారు
గుజరాత్‌లో అమానవీయ ఘటన;
విత్తనాలు కొని డబ్బులు చెల్లించడం మరిచిపోయిన వ్యక్తి పట్ల దుకాణ యాజమాని అమానవీయంగా ప్రవర్తించాడు. శుక్రవారం గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన ఈ ఘటనలో దుకాణం యజమాని, మరో ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు, బాధితుడిపైనా కేసు నమోదు చేయటం గమనార్హం. కిశోర్ బావ్రీ అనే వ్యక్తి కాకర విత్తనాలు కొని డబ్బులు చెల్లించటం మర్చిపోయాడు. దుకాణ యజమాని పార్మర్ అడిగిన వెంటనే రూ.500 చెల్లించాడు. అయినా, కోపంతో ఊగిపోయిన పార్మర్ మరో ఇద్దరిని పోగేసి కిశోర్‌ని తాళ్లతో కారు బ్యానెట్‌పై కట్టేసి, రోడ్లపై తిప్పాడు.