మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ పెద్దలు.బీఆర్‌ఎస్‌లో నాలుగేళ్లుగా ఉన్నా గుర్తింపు లభించలేదని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 2019లోక్‌సభ ఎన్నికల వేళ ఎంపీ ఎన్నికల్లో కవిత గెలుపు కోసం మండవ ఇంటికి వచ్చిన కేసీఆర్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. మండవకు ఎమ్మెల్సీ,రాజ్యసభ పదవి అంటూ ప్రచారం జరిగినా ఎలాంటి పదవులు దక్కలేదు. నాడు ఇంటికొచ్చి చేర్చుకొని..వాడుకొని వదిలేశారని ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.