Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక మలుపు
వివేకా హత్యకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కుట్ర: సీబీఐ;
వివేకా హత్య వెనుక అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కుట్ర ఉందని సీబీఐ ఆరోపించింది. హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో పలు అంశాలను ప్రస్తావించింది. కుట్ర,హత్య సాక్ష్యాల చెరిపివేతను వివరించిన సీబీఐ ఫొటోలు, గూగుల్ టేక్ అవుట్, లొకేషన్ డేటాలను..కోర్టుకు సమర్పించింది సీబీఐ. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టయిన వివరాలు సేకరిస్తున్నామని కోర్టుకు తెలిపిన సీబీఐ వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ నివేదిక రావాల్సి ఉందని తెలిపింది. పలు సెల్‌ఫోన్ల ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉందని వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నా ఆధారాలు లభించలేదని తెలిపింది.