తెలంగాణవాళ్లు మనల్ని తిట్టి, తన్ని తరిమేశారు -Pawan Kalyan
మన ఎంపీలు, ఎమ్మెల్యేల తప్పులకు మనం మాట పడ్డాం.;
ఏపీ ప్రజలకు ఆంధ్రా అనే భావన ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. 'తెలంగాణలో ఆంధ్రా కొడుకులు దోచేశారని మనల్ని తిట్టి, తన్ని తరిమేశారు. వాళ్ల నాయకులు మనల్ని తిట్టారు. మన ఎంపీలు, ఎమ్మెల్యేల తప్పులకు మనం మాట పడ్డాం. మనం పౌరుషం తెచ్చుకుని ఆంధ్రులం అనే భావన రాకపోతే మనం నాశనం అయిపోతాం. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే కులాలను గౌరవించుకోవడంతో పాటు ఆంధ్రా అనే భావన ఉండాలి' అని తెలిపారు.