వరంగల్ పర్యటనలో 6వేల109 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ.511 కోట్లతో రైలు వ్యాగన్ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో పాటుజగిత్యాల- వరంగల్ ఎన్‌హెచ్ పనులకు,మంచిర్యాల- వరంగల్ ఎన్‌హెచ్ పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం తన తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ దేశాభివృద్ధిలో తెలంగాణది కీలకపాత్ర అన్నారు.తెలుగువారి ప్రతిభ దేశసామర్థ్యాన్ని పెంచిందన్నారు. ఆర్థికవృద్ధి లోనూ తెలంగాణది ప్రధాన భూమిక అన్నారు. తెలంగాణ వికాసం కోసం చర్యలు చేపట్టామని తెలిపారు.