విశాఖలో పవన్ కళ్యాణ్ వారాహియాత్రకు అడుగడుగునా ఆంక్షలు విధించారు పోలీసులు.ఎయిర్‌పోర్టులోకి జనసేన నేతలకు అనుమతి నిరాకరించారు.స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా..ఎయిర్‌పోర్ట్ నుంచి పోర్ట్ రోడ్‌లో వెళ్లాలని సూచించారు. అయితే పోలీసుల నిర్ణయంపై జనసైనికులు మండిపడుతున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్ తాటి చెట్ల పాలెం మీదుగా..సిటీలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం తాము చెప్పిన రూట్ లోనే వెళ్ళాలని పట్టు పడుతుంటే కుదరదంటున్నారు జనసేన నాయకులు.