President Murmu : సబ్‌మెరైన్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరంలో జలాంతర్గామిలోకి ఎంట్రీ

Update: 2025-12-28 07:30 GMT

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం నౌకాదళ జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి.. నేవీకి చెందిన కల్వరి క్లాస్ సబ్ మెరైన్ ‘ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌’ లో ప్రయాణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి కూడా ఉన్నారు. కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌ లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. గతంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌ లో ప్రయాణించారు. ఇదిలా ఉండగా, ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం రాఫెల్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు.

Tags:    

Similar News