మాదక ద్రవ్యాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు. ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాను పంతంగి టోల్‌ప్లాజా వద్ద అరెస్ట్ చేశామని వెల్లడించారు. 40 లక్షల విలువైన 200 కిలోల గంజాయి, రెండు కార్లు సీజ్ చేశామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని సీపీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి మెడికల్ ఎమర్జెన్సీ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు.