Saudi : సౌదీ మల్టిపుల్ ఎంట్రీ వీసాల నిలిపివేత
ఇకపై సింగిల్ ఎంట్రీ వీసాలు మాత్రమే జారీ;
పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం సింగిల్ ఎంట్రీ వీసాలను మాత్రమే జారీ చేయాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. ఒక సంవత్సరంపాటు చెల్లుబాటయ్యే మల్టిపుల్ ఎంట్రీ వీసాలను నిరవధికంగా నిలిపేసింది. ఈ నిర్ణయం ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీర్ఘకాలిక వీసాలపై వచ్చేవారు చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేయడం కోసం, అనుమతులు లేకుండా హజ్ యాత్ర చేయడం వంటివాటికి పాల్పడుతున్నారని అధికారులు చెప్పారు. మల్టిపుల్ ఎంట్రీ వీసాల నిలిపివేత నిర్ణయం తాత్కాలికమేనని తెలిపారు. సింగిల్ ఎంట్రీ వీసాలు 30 రోజులపాటు మాత్రమే చెల్లుతాయి. హజ్, ఉమ్రా, రెసిడెన్సీ వీసాల్లో మార్పులు ఉండవు.