హనుమకొండ శ్రీనివాస కిడ్ని సెంటర్‌లో అగ్నిప్రమాదం

Update: 2023-08-16 11:17 GMT

హనుమకొండ శ్రీనివాస కిడ్ని సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆపరేషన్ థియేటర్‌లో విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పేషంట్లు, వారి బంధువులు బయటికి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 12 మంది పేషంట్లు ఉన్నారు. ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన పేషంట్లను బయటికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆపరేషన్ థియేటర్ సామాగ్రి మొత్తం కాలి బూడిద అయ్యింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

 

Tags:    

Similar News