మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి తమ రాష్ట్రానికి బదిలీకి చేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేసింది. ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది.