Telangana Elections: నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు

Update: 2023-10-09 07:30 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈమేరకు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఆకాశవాణి భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన కేంద్రం ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు చెప్పారు. అలాగే  నవంబర్ 30 న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  తెలంగాణాలి నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ -నవంబర్ 30, కాగా , నామినేషన్ల పరిశీలన - నవంబర్ 13,నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ - నవంబర్ 13కాగా 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలు  ఉండగా మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Tags:    

Similar News