నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్ రాజీనామాతో కేబినెట్‌లో ఖాళీ అయిన స్థానాన్ని పట్నం మహేందర్ రెడ్డితో భర్తీ చేయనున్నారు. మహేందర్‌రెడ్డి పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి నష్టం కలగకుండా.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పట్నం ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణం చేయనున్నారు మహేందర్‌రెడ్డి.