IPL: హై స్కోరింగ్ మ్యాచ్ లో పంజాబ్ శుభారంభం

పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్... రాణించిన శ్రేయస్ అయ్యర్;

Update: 2025-03-26 01:30 GMT

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు చేసింది. న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య గుజ‌రాత్ టైటాన్స్ పై 11 ప‌రుగుల‌తో విజయం సాధించింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ చివరి ఓవర్ వరకూ పోరాడింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 74, బట్లర్ 54, రూథర్ ఫోర్డ్ 46 పరుగులతో రాణించారు. గుజరాత్ 232 పరుగులకే పరిమితమైంది. 11 పరుగుల తేడాతో పంజాబ్ గెలిచింది.

అయ్యర్ ఊచకోత

టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 243 ప‌రుగులు చేసింది. శ్రేయస్ అయ్య‌ర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స‌ర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో శశాంక్‌ సింగ్‌ 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో శశాంక్ మెరుపు ప్రదర్శన చేశాడు. 19 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 97 పరుగులకు చేరుకున్న శ్రేయస్‌ కు చివరి ఓవర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆఖరి ఓవర్‌లో స్ట్రైకింగ్‌లో ఉన్న శశాంక్ ఏకంగా ఐదు ఫోర్లు కొట్టాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 3, రబడ, రషీద్ ఖాన్ లు చెరో వికెట్ తీసుకున్నారు.

గుజరాత్ పోరాడినా..

244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల‌కు 232 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఓపెనర్ సాయి సుద‌ర్శ‌న్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స‌ర్లతో 74 పరుగులు చేశాడు. , శుభ్‌మన్‌ గిల్‌ (33; 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బట్లర్‌ (54; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుథర్‌ఫోర్డ్‌ (46; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినప్పటికీ భారీ లక్ష్యం కావడంతో ఓటమి చవిచూసింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 2, మాక్స్‌వెల్‌, యాన్సెన్ ఒక్కో వికెట్‌ తీశారు. పంజాబ్ చేతిలో ఓడిపోయినా... గుజరాత్ పోరాటం మాత్రం ఆకట్టుకుంది. సొంత మైదానంలో గుజరాత్‌ చివరి ఓవర్ వరకూ పోరాడి ఓడింది. భారీ లక్ష్యం కళ్లముందు కనపడుతున్నా గుజరాత్ కడవరకు పోరాడింది. పంజాబ్ 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... గుజరాత్‌ 232 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (74), శుభ్‌మన్‌ గిల్‌ (33), జోస్‌ బట్లర్‌ (54), రుథర్‌ఫోర్డ్‌ (46) దూకుడుగా ఆడినా గుజరాత్ కు ఓటమి తప్పలేదు.

Tags:    

Similar News