IND vs ENG: ఇంగ్లాండ్-ఇండియా.. సమ ఉజ్జీలు
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 387 పరుగులకు ఆలౌట్... రాహుల్ క్లాసిక్ సెంచరీ;
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, టీమ్ ఇండియా మధ్య మూడో టెస్ట్ మూ- డోరోజు ఆటలో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. తొలి ఇన్నిం గ్స్ లో టీమ్ ఇండియా 387 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ కూడా తన తొలి ఇన్నింగ్స్ లో సరిగ్గా 387 పరుగులకే ఆలౌటైంది. - భారత్ 154/3 ఓవర్ నైట్ స్కోర్తో ఆటను ప్రారంభించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (100), రిషబ్పంత్ (74), రవీంద్ర జడేజా (72) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, జో ఆర్చర్, బెన్ స్టోక్స్ తలో 2, ట్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ చెరో 1 వికెట్ తీసుకున్నారు. టీమ్ ఇండియా 119.2 ఓవర్లకు 387 పరుగులకు ఆలౌటైంది. తర్వాత తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభిం- చిన ఇంగ్లాండ్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది. ది. బుమ్రా చేసిన ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. మూడోరో జు ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 2/0 స్కోర్ చేసిం- ది. జాక్ క్రాలీ (2), బెన్ డకెట్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
రాహుల్ అద్భుత శతకం
లార్డ్స్ కేఎల్ రాహుల్ కిది రెండో సెంచరీ (176 బంతుల్లో 100 పరుగులు). ఓవరాల్గా టెస్టుల్లో అతనికిది పదో శతకం. గతంలో లార్డ్స్ చివరిగా సెంచరీ చేసిన భారత బ్యాటర్ కూడా కేఎల్ రా -హులే కావడం విశేషం. అంతకుముందు అతడు 2021లో ఇంగ్లాం డిపై ఇదే వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ - లో 250 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో కేఎల్ రాహుల్ పలు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. లార్డ్స్ మైదానంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన నాలుగో విదేశీ ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021లో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో కూడా రాహుల్ (129) పరుగులు) సెంచరీ నమోదు చేశాడు. రాహుల్ కంటి ముందు లా ర్డ్స్ మైదానంలో బిల్ బ్రౌన్ (ఆస్ట్రేలియా), గోర్డాన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీ- స్), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) రెండు కంటే ఎక్కువ సెంచరీలు చే సిన పర్యాటక జట్ల ఓపెనర్లుగా నిలిచారు.
రిషబ్ పంత్ నయా హిస్టరీ
రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో కూడా సిక్సర్లు కొట్టడం. లో మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ పై టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును పంత్ క్రియేట్ చేశాడు. పంత్ తన బెస్ట్ కెరీర్లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు. దీనితో అతను వివియన్ రిచర్డ్స్ యొక్క ప్ర త్యేక రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మన్ గా నిలిచాడు. పంత్ ఇప్పటివరకు ఇం- గ్లాండ్పై 36 సిక్సర్లు కొట్టగా, వివ్ రిచర్డ్స్ 34 సిక్స- ర్లు కొట్టాడు. ఈ జాబితాలో, టిమ్ సౌతి మూడవ స్థానంలో, యశస్వి జైస్వాల్ నాల్గవ స్థానంలో, శుభ్- మాన్ గిల్ ఐదవ స్థానంలో ఉన్నారు. రిషబ్ పంత్ 56,07 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ 112 బంతుల్లో 74 పరుగులు చేసి ఔటయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.